Jun 11, 2012

భారత మాతా.గుండె ని రాయి చేసుకో తల్లీ!!

అపుడెపుడో.. 
ఆనందంగా పల్లెటూరు ని కౌగిలించుకుని మాటాలాడినట్టు లీలగా ఒక జ్ఞ్యాపకం ..


మట్టి రోడ్డు మీద మొరటుగా పడ్డ చినుకు తడికి లేచిన నెల గుబాళింపుని మనసు నిండా నింపిన అనుభవం..
బడి గంటకి పరిగెత్తుతున్నపుడు  పైరగాలికి రేపరేపలడుతూ ...పొలాలు ఆలపించిన పచ్చని రాగాల పరిచయం..
మామిడి తోటల్లో పిక్నిక్ లని ప్రకృతిని దగ్గరగా చూపించే ప్రయత్నానికి సలాము చేయలేని  బాల్య అసహయతనం..

చెట్టు కింద తరగతులు..సాంస్కృతిక సమ్మేళనాలు..
పరిపూర్ణ వ్యక్తిత్వ మార్గాలు..సర్వతో ముఖ వృద్ది సూత్రాలు ..

బడి అంటే చదువుతో పాటు జీవితాన్ని ..
మార్కులతో పాటు మనుషులుగా ఎలా నిలబడాలో చూపే ,నేర్పే స్థలమని..
ఆటలు ..పాటలు..నాటకాలు..నాయకత్వ లక్షణాలు..
ఇవి ముందు జీవితానికి..సవాళ్ళ సవారికి చాల అవసరమని
 పసి మనసుల్లోనే పటిష్టమైన పునాదులు వేసిన పవిత్ర ప్రదేశమని..

అపుడు తెలీలేదు..ఇపుడు తెలిసి దుఖం ఆగటం లేదు..

ఎక్కడికి వెళ్తున్నాం మనం?
విలువల సమాహారమైన మన విద్యా విధానాన్ని వీడి..ఎక్కడికి వెళ్తున్నాం మనం??

చదువంటే బట్టీ పోటీలని.. ర్యాంకుల సంకుల సమరమని..
బడంటే నాలుగు గోడలు ..రెండు కంప్యూటర్లు..ఒక సులువైన సంపాదానా మార్గం గా మార్చుకుని ..
అంతర్జాతీయ ప్రమాణాలని ..అంతకంతకు కోల్పోతున్న మన విధానాలతో..
.ఎక్కడికి వెళ్తున్నాం మనం???

భారత భూమి అంటే సంస్కృతి..భారత చరిత అంటే ఉన్నతి..
ఏనాడో ప్రపంచానికి ఇదీ  చదువంటే అని విశ్వ విద్యాలయాల ద్వారా చాటిన మనం..
చదువు లక్ష్యాన్ని రేపటి సంపాదనకి ముడి పెట్టి నేర్పే తరగతులు మన భావి తరాల్ని తీసుకేల్లేది ఎక్కడికి?

పేపర్లో ఫోటో కోసం...క్షణాలలో సమాధానాల వెతుకులాటలో అలసిన ఆ బాల్యం రేపు వెనక్కి తిరిగి చూసుకునేలా ..
జీవితానికి సరిపడా తీపి గుర్తులను ఏమిస్తున్నాం మనం?

నేర్చుకునే వయసులో ర్యాంకుల సంపాదనకి .పరిగెత్తి ..
సంపాదించే వయసులో నేర్చుకునేందుకు పరిగెత్తి ..పరిగెత్తి..చేరుకునే గమ్యం ఏమిటి..?

మనిషి చేసే తప్పులకి కాలం వేసే వేసే శిక్ష ..ఆ జాతి చరిత్రనే తిరగారాసేదైతే..
దాన్ని తప్పు కన్నా పాపం అంటే సబబేమో?

భారత మాతా..కాలపు ప్రతీ వీచికపైన విజయం తో విలసిల్లిన నీకు..
రాబోయేవి అలలు కావు..సునామి విష కీలలు అని ..నీ సంస్కృతీ తిలకానికి తిలోదకాలిచ్చె తరాలనీ తెలిసి..
గుండె ని రాయి చేసుకో తల్లీ!!

5 comments:

  1. మీరు వ్రాసిన ప్రతి అక్షరం సత్యం.మీ శైలికి అభినందనలు.
    విషయం కి అంతులేని విచారం . అర్ధం చేసుకున్నందుకు, అర్ధం కాని వారు ఉన్నదుకు కూడా.
    హక్కులని కాలరాచి..మనం ఏ అభివృద్ధి సోపానాలకి ఎగబ్రాకుతున్నట్లు? ఆలోచిస్తూ.. :)

    ReplyDelete
  2. బాగా చెప్పారండీ!

    ReplyDelete
  3. chakkaga raasaarandi,
    భారత మాతా..
    కాలపు ప్రతీ వీచికపైన
    విజయం తో విలసిల్లిన నీకు..
    రాబోయేవి అలలు కావు..
    సునామి విష కీలలు అని ..
    నీ సంస్కృతీ తిలకానికి
    తిలోదకాలిచ్చె తరాలనీ తెలిసి..
    గుండె ని రాయి చేసుకో తల్లీ!!
    lines ila unte bhaaguntayemo anipinchindandi.
    keep writing.

    ReplyDelete
  4. అంతా నిజమే. ప్చ్!

    ReplyDelete
  5. tallikemi kaadu

    tallini veedi parigedutunna biddalake dikkulenitanam daapuristumdi

    ReplyDelete

comment here whatever u want to.but please dont forget to put ur name also..have a great day