Apr 21, 2008

సంఖ్యా వ్యాఖ్యానం


ఏకం లోకం

అనేకం ,మనస్తత్వ తత్త్వం .

దిత్వం ఆత్మస్వరూపం

అద్వీతీయం పరమాత్మ సృష్టి సత్యం .

శక్తి రూప త్రయం ,

జాగృత జగత్ జీవం.

చతురానన కర్తవ్యమ్ ,

చైతన్య సృజన నిత్యం .

పంచేద్రేయాల సమాహారం ,

ప్రపంచ సుఖాల సమరం.

షడ్రుచులమయం జీవితం ,

శోభాయమానం నిత్యోదయం .

సప్తవర్ణ రంజితం సృష్టివిన్యాసం,

ఏకమే ఫలం ఆనందం సన్యాసం .

అష్టదిక్కుల అద్భుత అలంకారం ,

నష్టలాభాలతో నిత్యం జీవిత రణం.

నవరస భరితం నటనం ,

నిత్యం పాత్రదారులం మనం.

దశావతారాల దైవోద్దేశం,

లోకోద్దరనే ఏకైక లక్ష్యం.

ఇది సత్యం ..నిత్య నవ్యం.

మనఃశాంతే ,మనిషికి శాశ్వతం.

అశ్రువీక్షణం

కనుపాప లోపలివైపు

కన్నీళ్ళలో కొలువైనావ్ ..

కొలను లో తామర లా!

గుండె గుడి ని నీ పిలుపు గంటలతో

ఎన్ని సార్లు మ్రోగించానో ..

కోవేలలోని నీవు కరుణ కు బదులు

నిప్పులు కురిపించావ్..!!

హృదయంలో మంటను నిత్యం భరిస్తూ

కన్నీళ్ళతో చల్లర్చాలని యత్నిస్తూ ,నిట్తూర్స్తూ,

కోట్ల న్యురాన్ల మెదడు లో

విద్యుదగాత శక్తిలా తట్టుకోలేని భాదతో

నరాల సంఘర్షణలో ,

నేత్తుటి ని నీరు కాదు,కన్నీరు గా చేస్తూనే ఉన్నా!

ప్రతీ కన్నీటి బొట్టులో నీ రూపం కనపడుతుంటే

ఆ సౌందర్య వీక్షణ కి

క్షణ క్షణం కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి!

కంటి కెదురుగా లేవని నీవు కాదు,

కన్నీళ్ళని కరిగి కళ్లు ఎడారిలా ఎండుతాఎమో అని భాద!

తపన నా కోసం కాదు,

కన్నీళ్ళలో నీ రూపం కోసం !!!!!

Apr 8, 2008

ప్రేమ అంటే..

మనసు మల్లెల పరిమళాన్ని ఆస్వాదిస్తుందా ..?
ప్రశ్న మనసు ని కాదు నీ కనురెప్పలనడుగు,

అవి హాయిగా మూసుకుంటూ నీకు సమాదానమిస్తాయి!

అందం అన్నమాటకు ఆకారం ఉందా ?
జవాబుకై నీ గుండె తలుపు ని తట్టు ,

మది కోవెల లో కొలువున్న రూపం దర్శనమిస్తుంది!!

మోహం కలవని ...చూపుల దాహం తీరని ప్రక్రియను ఏమనాలి??

ప్రేమ అన్న పదమే మీ ప్రత్యుత్తరమైతే నా మనసు మరి కాదనలేకపోతుంది..!

కనుల ముందర కమనీయ సృష్టి, అందాల విందుని వడ్డిస్తున్నా..

మనసు తన అంతః నేత్రం తో ఏదో సౌందర్య పానం చేస్తుంది.

ఆకర్షణ అలలను దాటితే ప్రేమ సంద్రం శాంతం గా ఆహ్వానిస్తుంది.

సరదా అని అనుకోకుండా అయినా పడిపోతే భాధల అగాదాలకు బలైపోతావ్.

సదా లక్ష్యమే నిన్ను నిలబెడితే అందాల తీరాన్ని ఆనందాల నిధులతో చేరతావ్.

ప్రేమించడం తప్పు కాదేమో..

ప్రేమ తప్ప జీవితమే లేదంటే...తప్పనక తప్పదు కదా!!!

Feb 28, 2008

ఎన్నేలా నీవెక్కడ

పొద్దుగాల నుంచి ఏడికుంపటి లెక్క తెగ మరిగింది నేలమ్మ..

పోగగొట్టాలు కక్కుతున్ననల్లటి మబ్బులకి సందేలకే నడిరేత్రైనట్టున్నాది

బండ్లు వదిలే ఏడి గాలికి ఉక్కపోస్తున్నట్టు చెట్లు అప్పుడప్పుడు కదుల్తా ఉన్నాయి ...

తడికెల సందుల్లోంచి వచ్చే మసక వెల్తురు లెక్క చంద్రుడు కానోస్తున్నాడు

అక్కడక్కడ దాక్కున్న గాలిని అందుకోవడానికి ముక్కు తెగ ఆయాసపడిపోతాంది ...

ఇంత ఏడి లో కుడా చల్ల గాలి లెక్క పిలిచింది నా మల్లె , మామా అని .
కూడు సల్లార్తాదని దాని యావ ..

అసలు సల్ల బడేన్దుకు ఎక్కడ ఏడి తగ్గిందని...

ఎప్పటిలానే ..మా అమ్మమ్మ సెప్పిన ఎన్నెల కోసం సానా సేపు సూసిన ..

ఉహూ ..ఏదో దేవత శాపం పెట్టినట్టు చంద్రుడు మసకబారిండు..

దేవత కాదేమో ..మా నాయన సేప్పినట్టు గీ మనుషులే నేమో..

మల్లె కి కోపం వస్తాది జల్దేల్లకుంటే...

నా మల్లె ప్రేమనే ఎన్నెల అనుకోవాలేమో నేనిక!!!