Nov 4, 2009

సూర్యున్నై నే మిగిలా

తపన తో రగిలిన మది గగనం లో ..విరిసిన వేకువ వే  నీవా


వెన్నెల వర్షపు తొలి చినుకులతో..  తడిపిన  పున్నమి జాబిలివా..


 నా అన్న పిలుపు కై నే తీసిన పరుగిక చాలని..
నీవే నేనని తెలిసిన క్షణమే జన్మించానే ..


కల కాదని ఇది నిజమని. మనసoటూ ఉంటె ..
కల ఐతే మనగలనా..మరుక్షణమే మరణించనా,..


వణికించిన శిశిరపు తొలి చలి లో..


నీ తలపే.. వెచ్చని  ఆవిరిగా ..


ఉడికించే వేసవి మంటలలో ..


నీ చూపే చల్లని.తెమ్మెరలా .


క్షణమొక యుగముగా సాగిన జేవిత పయనం లో..


యుగమైన క్షణమే లే నీ తోడుగా ఇక గమనం లో..


నీ మాటే లేకుంటే చీకటి లే నేనంత ..


నీ స్పర్శే  తగిలిందే   సూర్యుడినే అయ్యానే.. 




Sep 5, 2009

నువ్వు.. నీ చిరునవ్వు ..

వెన్నెల వెళ్లిపోయినపుడు ,వేదన వీడని నీడ అయినపుడు..

వేకువలా , చీకటి లో చిరు దీపం లా నీ చిరునవ్వు!!

విజయం వెక్కిరించినపుడు,ప్రయత్నాలన్నీ ఎండమావులే ఐనపుడు..

ఎద లో ఆత్మ విశ్వాసం నిండేలా,ఎడారిలో చిరు జల్లులా మళ్ళీ నీ చిరునవ్వు!!

తెగుతున్న దారాల్లా ఆశ సన్నగిల్లినపుడు,ఉషస్సు లేని ఉదయం లా జీవితం మారుతుందనిపిస్తున్నపుడు..

మళ్ళీ ..నిస్తేజాన్ని కరిగిస్తూ,కొత్త శ్వాస ను నింపుతూ,భగవద్గీత లా నీ నవ్వు!!

ప్రపంచమంతా పనికిరానిదని, పంకిలమైనదని పరి పరి విధాల పరితపిస్తుంటే

పవిత్రంగా, పద్మ పత్రం మీద నీటి బిందువులా పల్లవిస్తూ నీ నవ్వు!!

ఎడతెరపని తుఫానుని ఆపుతూ స్వచ్చం గా ఉదయిస్తున్న బాల భానుని ప్రశాంతత తో

రణగొణ ధ్వనుల మద్య షెహనాయి, నాదస్వరం ల శ్రావ్యత తో

తటాక మధ్యమున తలెత్తి నిలుచున్న తామర సౌందర్యం తో

బీడు బారిన భూమి భాదంతా తీరేలా తాకిన తొలకరి ఆప్యాయత తో ...నన్ను మార్చే నీ నవ్వు!!

నేనేంటో నాకే తెలీనపుడు.. నువ్వే నేననిపించేల ..నా ప్రస్థానాన్ని నా గమ్యాన్ని నాకు చూపించి
నడిపించే నా అంతరాత్మలా ..
నాకే తెలీని నా శక్తిని సరికొత్తగా పరిచయం చేసే చల్లని నీ నవ్వు..నువ్వు!!


కాళ్ళ కింద నేల కదిలిపోతున్నా..నిన్న ,రేపు నన్ను వదిలిపోతున్నా...నువ్వు నీ చిరునవ్వు ఇవి చాలు నా ఈ నేటికి ...

చెప్పాలంటే కరిగిపోకుంటే... ఈ క్షణానికి!!



Jun 18, 2009

తెలుగు-దిగులు

ఆకాశం సూర్యోదయం వెన్నెల తొలకరి ...ఇలా ఎన్నో తెనెలూరే తెలుగు మాటలు విని ఎన్నో జన్మలైనట్టుంది..
ఆగని ఉరుకుల పరుగులతో.. అలసట నిండిన రోజులతో
కనురెప్పలు బతిమాలుకునే పని ఒత్తిడి లో
పచ్చని రంగు కాగితాల పాకులాటల ముందు కలలు కవితలు ఆనందాలు అనుభూతులు అన్నీ పరాయి అయ్యాయి..బరువు అయ్యాయి..


చిన్నప్పుడు చందమామ ను చూపి గోరుముద్దలు పెట్టిన తల్లులను గూగుల్ లో వెతికినా ఇప్పుడు కనపడరు..
పాదాలకు పారాణి తో పైర గాలికి వంత పాడే పావడ తో పరిగెత్తే పదహారేళ్ళ అందాలన్నీ ఎప్పుడో జీన్స్ టీ షర్ట్స్ తో జట్టు కట్టాయి


తెలుగు వాళ్ళం తెలుగు లో నే మాట్లాడుకుందాం అని తెగ దంచే వాళ్ళే తెలుగు తెలీనట్టు మాట్లాడటం నేడు చాలా సాధారణం.
మనం తెలుగు వాళ్ళం అని గుర్తు చేస్తేనే తప్ప తెలుగు మాట్లాడని మన దౌర్భాగ్యానికి మనం కాస్తైన సిగ్గు పడం ..మమ్మీనే ముద్దని అమ్మని మారుస్తాం...నాన్న వద్దని డాడి తో మురుస్తాం...


కంప్యూటర్లు తప్ప కమ్మనైన కోకిల గానం తెలీని మనం
వెబ్ ప్రపంచం తప్ప వెన్నెల వెలుగులను చూడని మనమా
మన ఘనమైన గతాన్ని భవితవ్యానికి మోసుకేల్లేది..
మన వారసులకి ఇచ్చేది ...


ప్రశ్నించుకుంటే నే పరిస్తితి కాస్తైన మారేది...
మార్పు మొదలైతే నే మన ఉనికి భవితవ్యానికి తెలిసేది..


తెలుగు భాష ఒకప్పుడు దివ్యం గా వెలిగేది అని రేపు చెప్పుకునే రోజు రాకూడదనే ఈ ప్రయత్నం..
మా తెలుగు తల్లి కి మల్లెపూదండ !!!