Feb 28, 2008

ఎన్నేలా నీవెక్కడ

పొద్దుగాల నుంచి ఏడికుంపటి లెక్క తెగ మరిగింది నేలమ్మ..

పోగగొట్టాలు కక్కుతున్ననల్లటి మబ్బులకి సందేలకే నడిరేత్రైనట్టున్నాది

బండ్లు వదిలే ఏడి గాలికి ఉక్కపోస్తున్నట్టు చెట్లు అప్పుడప్పుడు కదుల్తా ఉన్నాయి ...

తడికెల సందుల్లోంచి వచ్చే మసక వెల్తురు లెక్క చంద్రుడు కానోస్తున్నాడు

అక్కడక్కడ దాక్కున్న గాలిని అందుకోవడానికి ముక్కు తెగ ఆయాసపడిపోతాంది ...

ఇంత ఏడి లో కుడా చల్ల గాలి లెక్క పిలిచింది నా మల్లె , మామా అని .
కూడు సల్లార్తాదని దాని యావ ..

అసలు సల్ల బడేన్దుకు ఎక్కడ ఏడి తగ్గిందని...

ఎప్పటిలానే ..మా అమ్మమ్మ సెప్పిన ఎన్నెల కోసం సానా సేపు సూసిన ..

ఉహూ ..ఏదో దేవత శాపం పెట్టినట్టు చంద్రుడు మసకబారిండు..

దేవత కాదేమో ..మా నాయన సేప్పినట్టు గీ మనుషులే నేమో..

మల్లె కి కోపం వస్తాది జల్దేల్లకుంటే...

నా మల్లె ప్రేమనే ఎన్నెల అనుకోవాలేమో నేనిక!!!