Jun 5, 2011

స్వేచ్చా వాయువులు  దేశ మాత ముంగురలతో ఆటలాడే చారిత్రిక సమయాన.
దక్కను డొక్కను చింపి ..స్వతంత్రమా నువ్వెక్కడ అని ..అరిచే గొంతుకలలో గుండ్లను నింపి.
తెలంగాణా అని తపించిన ప్రతీ తనువు ని రజాకార్ అని రక్తపు మడుగులో ముంచి..
చితి మంటల మీద చిరు నవ్వులతో ..నీరో నేనే అని నిరూపించిన ఓ నవాబు..
 భాద పడకు..భాదపడకు.. నీ వారసులు ఒకరు కాదు వంద కాదు..
తోడబుట్టిన తోడేళ్ళు .. చాల ఉన్నాయి..నీ పైశాచిక పాచికలను తెగ తిప్పుతూ..

అన్నా..నువ్వు వేరు ..మేము వేరు..
నీ మాట తీరు..బ్రతుకు తెరువు..మాకు తెలియవు.
మా దారిన మే పోతాం..మా ప్రాంతం మాకిమ్మంటే 
ఈ లోల్లేంది..బిల్లేంది...మా రక్తపు కూడు పైనా మోజేంది..

 ఉస్మానియా లో ఉడుకుతున్న రక్తం ఇపుడొక రాజకీయ పాచిక
పార్టీలకు పని పడితే .. మీడియా ఐడియాలు ఐపోతే..
ఉందికదా దశాబ్దాల దడ పుట్టించే డమరుకం..
మైకులు ఊగిపొతాయి..స్క్రీనులు గొంతు చిన్చుకుంటాయి.. 
ఆవేదన నిండిన గొంతుకల ఆక్రోశం నిస్సత్తువ లా  కనిపిస్తే..
ఆరాటపు పోరాటం ..ఆటలాగా నువ్వు భావిస్తే..
ఆవేశం  ఎత్తిన పిడికిళ్ల  పోటు నీ రక్తం చిందిస్తుంది..
అవకాశాముగా వాడుకునే అధికారానికి ..అది కాళరాత్రి..చివరి రాత్రి అవుతుంది,,

తెలుగు తమ్ముడా అని విడిపోతే..అన్నా అని ఆత్మీయం గా పలకరిస్తాం.
నాదే ఈ తెలుగు నాడని గర్విస్తే...పోరాటం కొత్త కాని ఘర్జనకి గతమైతావ్..
     

బతుకమ్మ ని పేర్చే చెయ్యి బతుకిమ్మని అర్తిస్తుంటే..
నా నీళ్ళని నువ్వు తాగి..నా  భూమి ని నువ్వు అమ్మి..
నన్నే నాకే అమ్మే నీ తెలివి మాకు లేదు...పక్కనోడి చెమట తాగే నీచపు ఆలోచన అసలే లేదు..

నిన్నటి సీమాంధ్ర నినాదం కాదు నాది ..నీ  జేబు లా నాలుకలు మార్చే ఉద్యమం అసల కాదిది..
ఒక విప్లవం..ఒక చారిత్రిక  వాస్తవం..ఒక నిరంకుశపు పాలనను తెరదించిన లక్షల గొంతుల ఒకే శబ్దం.
అసలే ఎండని ఆరాటం మాది..ఆగని ఉప్పెనల పొంగే పోరాటం మాది..
తెల్లోడి తోలు తీసి..నవాబుని ఉరికించిన ఈ ఉద్యమానికి మీరెంత ..మీ శక్తెంత..
మరొక స్వతంత్ర పోరాటమనుకుంటే..
ఇంకొక నవాబు దిగాడనుకుంటే..
అన్నా అని అన్న గలమే..ఏరా అని   ఉరుముతుంది..
నేడు నిజం కానీ కల రేపైనా..నీ ఊపిరి ఆపైనా తల్లి తెలంగాణా సొంత గజ్జే కట్టి ఆడుతుంది..